జగన్​ అస్తవ్యస్త పాలనతో ప్రభుత్వ ఖజానా ఖాళీ: నారా లోకేశ్​ - ఏపీ పెండింగ్​ నిధులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 7:39 PM IST

Updated : Jan 26, 2024, 8:25 PM IST

Nara Lokesh on Aarogya Sri: ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి అస్తవ్యస్త పాలనతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ విమర్శించారు.  ఆరోగ్యశ్రీ నెట్​వర్క్ హాస్పిటల్స్​కు దాదాపు 1200 కోట్ల రూపాయలు నిధులు పెండింగ్​లో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోనే ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారని తెలిపారు. పేదవాళ్ల  వైద్యం గాలిలో దీపంలా మారిందని, ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. 

పెండింగ్​ నిధులను విడుదల చేసి సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపని వైఎస్సార్​సీపీ ప్రభుత్వం, ఆసుపత్రులను డీలిస్ట్​ చేస్తూ బెదిరింపులకు పాల్పడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర వైద్య సేవల అంశంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయకులను బలిపశువులుగా మార్చవద్దని హితవు పలికారు. లక్షలాది మంది పేదవారి ప్రాణాలతో కూడుకున్న ఈ అంశంలో ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని, ఇప్పటికైనా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Last Updated : Jan 26, 2024, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.