ఐదేళ్లలో నీటి ఎద్దడిపై ప్రభుత్వం ఒక్కసారి సమీక్ష నిర్వహించలేదు: లోకేశ్ - Nara Lokesh Letter to Collector - NARA LOKESH LETTER TO COLLECTOR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 7:37 PM IST

Nara Lokesh Letter to Guntur Collector about Mangalagiri Water Problem: మంగళగిరిలో తాగునీటి సరఫరా అంతరాయంపై గుంటూరు కలెక్టర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. వేసవి కారణంగా తలెత్తిన తీవ్ర తాగునీటి ఎద్దడిని ప్రభుత్వం పరిష్కరించకపోగా, ఎన్నికల కోడ్ సాకుతో సేవా కార్యక్రమాలు అడ్డుకోవడం తగదని లోకేశ్ మండిపడ్డారు. 

మంగళగిరి పరిధిలోని నవులూరు, యర్రబాలెం, చిన కాకాని, ఆత్మకూర్, కాజా, మంగళగిరి పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని లోకేష్‌ లేఖలో పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో తాగునీరు సరఫరాకు అంగీకరించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 2022 ఏప్రిల్ 20 నుంచి వాటర్ ట్యాంక్‌ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తోందన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా త్రాగునీటి సరఫరా నిలిచిపోయిందని లేఖలో లోకేశ్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిపై ప్రభుత్వం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని లోకేశ్ మండిపడ్డారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.