అధికారంలోకి రాగానే వ్యవస్థలన్నింటిని గాడిలో పెడతాం- లోకేశ్ - Nara Lokesh Election Campaign - NARA LOKESH ELECTION CAMPAIGN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 4:26 PM IST

Nara Lokesh Election Campaign at Mangalagiri: వైఎస్సార్సీపీ పాలనలో ఆరోగ్య శ్రీ పథకం అనారోగ్యశ్రీలా మారిందని మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థి లోకేశ్ విమర్శించారు. సంక్షేమ పథకాలు రద్దు చేసి పేదలను, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరి కొండపనేని టవర్స్ వాసులతో లోకేష్ సమావేశమయ్యారు. 

Lokesh Assurance To Handloom Workers: అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టే బాధ్యత తీసుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు. చేనేత అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయం అందిస్తామని ప్రజలకు లోకేష్ భరోసా ఇచ్చారు. మంగళగిరిలో చేనేత మగ్గాలు వెయ్యికి పడిపోయాయని వాటిని 5000కు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంగళగిరిలో పెద్ద ఎత్తున మాలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరిలో చేనేత కార్మికులకు, స్వర్ణకారులకు నూతన డిజైన్లపై శిక్షణ ఇప్పిస్తామని లోకేశ్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.