'రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజలంతా చేయిచేయి కలిపి మంచి నాయకుడ్ని ఎన్నుకోవాలి' - Bhuvaneshwari Nijam Gelavali Yatra - BHUVANESHWARI NIJAM GELAVALI YATRA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-03-2024/640-480-21054598-thumbnail-16x9-nara-bhuvaneshwari-nijam-gelavali-yatra-in-guduru.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 23, 2024, 2:17 PM IST
Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra in Guduru : 'నిజం గెలవాలి' పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి తిరుపతి జిల్లా గూడురు ఏ 5 కన్వెన్షన్ వద్ద మహిళా శ్రామికశక్తితో భువనేశ్వరి మాటామంతీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని నారా అన్నారు. జగన్ (Jagan) పాలనలో దోపిడీ తప్ప అభివృద్ధి లేదని పనుల్లేక కూలీలు వలసలు వెళ్తున్నారన్నారు.
విశాఖను రాజధాని చేస్తామని చెప్పిన జగన్ డ్రగ్స్ కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజలంతా చేయిచేయి కలిపి మంచి నాయకుడ్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. గూడూరులో మహిళా శ్రామిక శక్తితో భువనేశ్వరి ముఖాముఖిలో మహిళలు సొంత కాళ్లపై నిలబడాలని సూచించారు. మహిళల వల్ల కాని పనేదీ లేదని ప్రతీ అతివ ఆత్మ స్థైర్యంతో ముందుకెళ్లాలని సూచించారు. వైసీపీ (YSRCP) పాలన రాక్షస పాలనకు అద్దం పట్టిందని ధ్వజమెత్తారు. అందరూ ఆలోచించి సరైన నాయకుడికి ఓటు (Vote) వెయ్యాలని అన్నారు.