మీ బిడ్డల భవిష్యత్​ ఆలోచించి ఓటు వేయండి: నిజం గెలవాలి యాత్రలో భువనేశ్వరి - Nijam Gelavali Yatra

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 11:57 AM IST

Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra: రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ప్రజాస్వామ్యం రావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆకాంక్షించారు. గురువారం పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఆమె పర్యటించారు. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరులో 'నిజం గెలవాలి యాత్ర' లో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపం చెంది మృతి చెందిన బోయపాటి మణికంఠ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. మణికంఠ కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో దాచేపల్లి శివరామయ్య కుటుంబాన్ని పరామర్శించారు. 

సీఎం జగన్‌  పాలనలో 30,196 మంది మహిళలు అపహరణకు గురైతే ఇంతవరకు వారి ఆచూకీ లభించలేదన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఇచ్చిన బలం, ధైర్యంతోనే ప్రస్తుతం ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో అందరూ చేతులు కలిపి ముందుకు నడవాలని సూచించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో 203 మంది కార్యకర్తలు చనిపోవడంతో ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా కలుస్తున్నానని ఆమె  తెలిపారు. మీ బిడ్డలు, భావితరాల భవిష్యత్తు ఆలోచించి ఓటు వేయాలని తల్లిదండ్రులను కోరారు. రాష్ట్రం, దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, గుంటూరు లోక్‌సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.