అభిమానికి ఊహించని గిఫ్ట్- కుటుంబంతో కలసి భోజనం చేసిన బాలయ్య - Balakrishna Lunch With his fan - BALAKRISHNA LUNCH WITH HIS FAN
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 10:25 PM IST
Nandamuri Balakrishna Having Lunch With his fan in Kurnool District : సినిమా షూటింగ్లో ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ తన అభిమాని కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో నందమూరి బాలకృష్ణ 109 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఆదోని పట్టణానికి చెందిన నందమూని యువసేన సేవా సంస్థ అధ్యక్షులు సజ్జాద్ కు బాలకృష్ణ నుంచి పిలుపు వచ్చింది. దీంతో భార్య, కొడుకుతో కలిసి సజ్జాద్ బాలకృష్ణ ఘూటింగ్ స్పాట్లో వెళ్లి కలిశారు. అనంతరం ఆ అభిమాని కుటుంబంతో కలిసి ఆప్యాయంగా మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ భోజనం చేశారు.
అలాగే సజ్జద్ కుమారుడి గురించి అడిగి తెలుసుకున్నారు. బాగా చదివించి పెద్దవాడిని చేయాలని ఈ సందర్భంగా సజ్జద్ కు బాలయ్య సూచించారు. దీనిపై అభిమాని సజ్జాద్ మాట్లాడుతూ, తన కుటుంబంతో కలిసి బాలయ్యా భోజనం చేయాటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాజకీయాలు, సినిమాలతో ఎప్పుడు బీజీగా ఉండే బాలకృష్ణ తన అభిమానులను గుర్తుంచుకొని ఆప్యాయంగా పలకరించాటం జీవితంలో మర్చిపోలేని సంఘటనని తెలిపారు.