అతిసార బాధితులని పరామర్శించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ - ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
🎬 Watch Now: Feature Video
Nadendla Manohar Visited Died After Drinking Contaminated Water in Guntur District : గుంటూరు జిల్లా తెనాలిలోని గురవయ్య కాలనీలో కలుషిత నీరు తాగి బండి లక్ష్మి అనే మహిళ మృతి చెందింది. లక్ష్మి కుటుంబాన్ని జనసేన నేత, పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. అదేవిధంగా రెండు రోజుల క్రితం కలుషిత నీరు తాగి 13 మంది అనారోగ్యానికి గురయ్యారు. బాధితుల ఇంటింటికి వెళ్లి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంచి నీటి వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, మురికి నీరు వస్తున్నాయని స్థానికులు తెలిపారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గురవయ్య కాలనీలో మున్సిపాలిటీ నీరు తాగి అనేక కుటుంబాలు అతిసార బారిన పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
ఇప్పటికే కలుషిత నీరు తాగి సుమారు 13 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఒక మహిళ మృతి చెందిందని వివరించారు. చాలా మంది అస్వస్థతకు గురై గుంటూరు ,తెనాలి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అతిసార వల్ల చనిపోయిన వారిని, అలాగే చికిత్స పొందుతున్నావారిని ప్రభుత్వం ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని వెల్లడించారు. గుంటూరులో తక్షణమే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.