ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని మైలవరం జలాశయం - నీటి నిల్వ కరవై ప్రజల అవస్థలు - no repairs to Mylavaram Reservoir - NO REPAIRS TO MYLAVARAM RESERVOIR
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 12, 2024, 1:58 PM IST
Mylavaram Dam Obstructions to Water Storage : 50 ఏళ్ల క్రితం వైఎస్‌ఆర్ జిల్లా మైలవరం వద్ద పెన్నా నదిపై నిర్మించిన మైలవరం జలాశయం ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. సుమారు 10 టీఎంసీల నీటి సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలకు తాగునీరు సైతం అందిస్తున్నారు. ప్రస్తుతం జలాశయం పరిస్థితి దయనీయంగా మారింది. కట్టపై రోడ్డు మార్గం భయంకరంగా తయారైంది. రక్షణ గోడలు శిథిలమై పోయాయి. జలాశయంలో పూడిక తీయకపోవడంతో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేయడం కుదరట్లేదు.
Mylavaram Dam Repairs Pending For Years : దీంతో ఆయకట్టు రైతులు సాగు నీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాదైనా నిధులు కేటాయించి ఆధునికీకరణ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 75 ఎకరాలకు నీరందించాల్సిన రిజర్వాయర్ గండిపడటంతో చుట్టుపక్కల గ్రామాలకు పెద్ద సమస్యగా మారింది. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి స్థానిక ప్రజలు కోరుతున్నారు.