రంజాన్ రోజున ముస్లిం మహిళలను జగన్ కంటతడి పెట్టించారు : చంద్రబాబు - Muslim Women Meet Chandrababu
🎬 Watch Now: Feature Video
Muslim Women Meet Chandrababu : రంజాన్ రోజున ముస్లిం మహిళలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు వద్ద కంటతడి పెట్టుకున్నారు. టిడ్కో ఇళ్లు ఇవ్వకపోయినా రుణాలు కట్టాలంటూ బ్యాంకులు వేధిస్తున్నాయని మహిళలు చంద్రబాబు వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో చంద్రబాబును కలిసి వారి గోడు వెళ్లబోసుకున్నారు. ఇళ్లు అప్పగించకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి తాళం అప్పగించేవరకూ రుణాలు అడగమని సంతకాలు తీసుకున్న అధికారులు, ఇప్పుడు 3 లక్షలు రూపాయలు కట్టాలంటూ రోజూ వేధిస్తున్నారని బాధిత మహిళలు వాపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Chandrababu Naidu About Tidco Houses : రంజాన్ రోజున ముస్లిం మహిళలను జగన్ కంటతడి పెట్టించారని చంద్రబాబు అన్నారు. పేదవాడికి మంచి ఇళ్లు ఉండాలన్న సంకల్పంతో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను చేపట్టామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం నుండి 1.5 లక్షలతో టిడ్కో ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్మన్నారు. భూమి, విద్యుత్, రోడ్లు వంటి మౌళిక సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసిందని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే ఉచితంగా ఇళ్లు ఇస్తామని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారని కానీ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లుగా ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించకపోగా వాటిపై అప్పులు తెచ్చి లబ్ధిదారులపై భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో నెల రోజుల్లో ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని, మిగిలిన పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇంటిని అప్పగిస్తామని స్పష్టం చేశారు.