'ముస్లింల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించాలి'
🎬 Watch Now: Feature Video
Muslim Leaders Demand to Solve Their Problems : ముస్లిం సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టే విధంగా ప్రధాన రాజకీయ పార్టీలు వారి మేనిఫెస్టోలో పెట్టాలని ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కర్నూలులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మిల్లి కౌన్సిల్ రాష్ట్ర నాయకులు షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ, భారతదేశంలో మైనార్టీలుగా ఉన్న ముస్లింలకు ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని పాలకులు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయ్యారని తెలిపారు.
పేద ముస్లింల అభివృద్ధి కోసం వక్ఫ్ భూములు కేటాయిస్తే వాటిని పాలకులు కబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ముస్లిం పేద మహిళల కోసం ప్రవేశ పెట్టిన దుల్హాన్ పథకానికి కేవలం పదవ తరగతి పాస్ అయిన వారే అర్హులని షరతు పెట్టడం సరికాదన్నారు. ముస్లింల అభివృద్ధి కోసం పాటు పడే రాజకీయ పార్టీకే వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని మహబూబ్ బాష తెలిపారు. ఈ కార్యక్రమంలో మిల్లి కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ ఖదర్ పాల్గొన్నారు.