ఆకలితో అలమటిస్తున్న చిన్నారుల కడుపు నింపుతున్న మదర్స్ మిల్క్ బ్యాంక్ - ఎక్కడో తెలుసా? - Mother Milk Bank - MOTHER MILK BANK

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 3:59 PM IST

Mother Milk Free Of Cost At Vijayawada Andhra Hospital : తల్లిపాలు ఎంతో శ్రేష్ఠమైనవి. పసిపిల్లలకు రోగనిరోధక శక్తితోపాటు జ్ఞాపకశక్తిని అందించే అద్భుతమైన ఔషధ గుణాలుగా తల్లిపాలు పనిచేస్తాయి. కానీ 30 నుంచి 40 శాతం మంది చిన్నారులకు పూర్తిస్థాయిలో తల్లిపాలు అందట్లేదని నివేదికలు చెబుతున్నాయి. తల్లిపాలు అందక ఆకలితో అలమటిస్తున్న నవజాత శిశువుల కోసం రోటరీ క్లబ్, ఆంధ్ర హాస్పటల్స్ ఆధ్వర్యంలో విజయవాడ మదర్స్ మిల్క్ బ్యాంక్​ను ఏర్పాటు చేశారు. తల్లిపాలు అవసరమైన వారికి ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంక్​ల్లో 15 ఎంల్ తల్లి పాలను 650 రూపాయలకు విక్రయిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. రోజుకు చిన్నారికి 300 ఎంఎల్ పాలు అవసరమవుతాయని తెలిపారు. అయితే ప్రస్తుతం 30 నుంచి 40 శాతం మంది పిల్లలకు 300 ఎంఎల్ తల్లిపాలు అందటంలేదని వైద్యులు చెబుతున్నాయి. దీంతో శ్రేష్ఠమైన తల్లిపాలను ఐదు అంచెల్లో భద్రపరిచి చిన్నారులకు అందిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. తల్లిపాలు ఇచ్చేందుకు డోనర్స్ ముందుకు వస్తే ఎంతో మంది చిన్నారుల ఆకలి తీర్చవచ్చని ఆంధ్ర హాస్పటల్స్ డైరక్టర్ డా.పివి రామారావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.