విశాఖ రైలు అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమా? - TRAIN FIRE ACCIDENT - TRAIN FIRE ACCIDENT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 4, 2024, 5:21 PM IST
More Details on Train Fire Accident in Visakha Railway Station: విశాఖ రైల్వే స్టేషన్‌లో రైలు నుంచి మంటలు వ్యాపించిన ఘటనలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. రైలులో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పేశారు. దగ్ధమైన బోగీలను రైలు నుంచి వేరు చేసి తరలిస్తున్నట్లు సిబ్బంది పేర్కొన్నారు. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా రైల్వే సిబ్బంది భావిస్తున్నారు. నాలుగో ప్లాట్ ఫారంపై ఉన్న కోర్బా- విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులోని బి-7, బి-6, ఎం-1 బోగీల్లో మంటలు వ్యాపించి దగ్ధమైన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదని వాల్తేరు రైల్వే డివిజన్ మేనేజ్మెంట్ సౌరబ్ ప్రసాద్ చెప్పారు. రైలులో ఫోమ్ స్ప్రే వస్తువులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అగ్ని ప్రమాద ఘటనపై రైల్వే సిబ్బంది పరిశీలిస్తున్నారని ఆయన వివరించారు. విశాఖ రైల్వే స్టేషన్‌లోని ప్రస్తుత పరిస్థితులపై మరిన్ని వివరాలను మా ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.