'కోతి' చేష్టలతో కిటికీలో ఇరుక్కుంది- వీడియో వైరల్ - Monkey Stuck in Window - MONKEY STUCK IN WINDOW
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-08-2024/640-480-22237602-thumbnail-16x9-monkey-stuck-in-hospital-window-viral-video.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 18, 2024, 7:54 PM IST
Monkey Stuck in Hospital Window Viral Video: సాధారణంగా కోతులు అంటేనే అల్లరి. తనకు అవసరం లేని పనుల్లో వేళ్లు పెడుతూ ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక చిలిపి పనులు చేస్తూ ఉంటాయి. ఇలానే ఓ కోతి తుంటరి పనులు చేస్తూ ఓ ఆస్పత్రిలోని కిటికీలో ఇరుక్కుపోయింది. ఇంకేముందీ బయటకు రాలేక లబోదిబోమంటూ కేకలు వేస్తూ ఆస్పత్రిలో హోరెత్తించింది. చివరికి ఏం జరిగిందంటే?
వివరాల్లోకి వెళ్తే: నెల్లూరు జిల్లా ఆత్మకూరు శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాలలో ఆదివారం ఓ కోతి కిటికీలో ఇరుక్కుంది. అందులో నుంచి బయటకు రాలేక కేకలు పెడుతూ ఉంది. ఎవరినీ దగ్గరికి రానివ్వకుండా ఉండడంతో ఆస్పత్రిలో రోగులు, వైద్యసిబ్బంది దగ్గరకు వెళ్లేందుకు కొంత భయపడ్డారు. కానీ ఆ చిన్న కోతి మాత్రం అలాగే అరుస్తూ తన బాధను వ్యక్తం చేస్తున్న తరుణంలో ఆస్పత్రికి చెందిన డాక్టర్ కుమార్ ధైర్యం చేశారు. కోతి వద్దకు వెళ్లి టవల్ సహాయంతో దానిని నెమ్మదిగా బయటకు తీశారు. దీంతో కోతి ఆనందంతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీసింది. కోతి ప్రాణాన్ని కాపాడిన డాక్టర్ కుమార్ను పలువురు అభినందించారు.