శ్రీకాళహస్తిలో ఉరుములు, మెరుపులతో వర్షం - రహదారుల జలమయంతో ప్రజల ఇబ్బందులు - Moderate Rain IN SRIKALAHASTI - MODERATE RAIN IN SRIKALAHASTI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 24, 2024, 9:28 AM IST
Moderate Rain With Thunder Storm And Lightning in Srikalahasti : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎండ తీవ్రత కొంత తగ్గినా ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతుండేవారు. ఆదివారం సాయంత్రం వాతావరణం చల్లపడింది. వెంటనే వర్షంతో పాటు పలు చోట్ల పిడుగులు కూడా పడ్డాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లగా ఉండటంతో పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఉపశమనం పొందారు. నగరంలో కురిసిన వర్షానికి వీధుల్లో ఉన్న రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు వీధుల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, ఆలయానికి చేరుకునే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే వీధుల్లో నీరు నిల్వ చేరి రహదారులన్నీ కాలువల్లా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. వర్షం కురిస్తే చాలు రహదారులు చెరువును తలపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంటోందని పేర్కొన్నారు. అనేక సార్లు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి స్పందన లేదని కాలనీవాసులు వాపోతున్నారు.