నల్లదనాన్ని వెలికితీసి పేదలకు పంచుతామన్న బీజేపీ హామీ ఏమైంది : జీవన్ రెడ్డి - MLC Jeevan Reddy Fires On BJP - MLC JEEVAN REDDY FIRES ON BJP
🎬 Watch Now: Feature Video
Published : Mar 28, 2024, 6:57 PM IST
|Updated : Mar 29, 2024, 12:34 PM IST
MLC Jeevan Reddy Fires On BJP : దేశంలోని నల్లదనాన్ని వెలికి తీసి పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు ఇస్తామని ఇచ్చిన హామీని మరిచిన మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం పని చేశారని, బీజేపీ ఇందుకు బీఆర్ఎస్కు అడ్డుగోడలా నిలిచిందని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, నల్లధనాన్ని వెలికి తీసి పేదలకు పంచుతామనే హామీని మరిచిన మోదీ ప్రభుత్వం, పెట్రోల్, నిత్యావసరాల ధరలను మాత్రం పెంచిందని జీవన్ రెడ్డి విమర్శించారు. ఈ విషయంపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని కూడా మరిచిందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కేసీఆర్ అవినీతిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 14 నుంచి 15 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు స్థానిక రామాలయంలో జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.