గద్దర్ వాడిన వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేయాలి : దేశపతి శ్రీనివాస్ - Deshapathi Srinivas latest Comments
🎬 Watch Now: Feature Video
Published : Feb 15, 2024, 3:15 PM IST
MLC Deshapathi Srinivas On Gaddar in Legislative Council : శాసనమండలిలో ప్రజాయుద్ధ నౌక గద్దర్‌పై చర్చ జరిగింది. గద్దర్ పేరు మీద ఒక జాతీయ స్థాయి అవార్డు, పరిశోధన కేంద్రం, స్మారక భవనం, ఆయన వాడిన వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కోరారు. తెలంగాణ ప్రజల కోసం పాటను విప్లపంగా చేసిన వారని శ్రీనివాస్ అన్నారు. ఆయన పాట ద్వారా దళిత, బహుజన చైతన్యాన్ని నింపిన వ్యక్తి అని తెలిపారు. జీతగాళ్ల రాజకీయాలను ముందుకు తీసుకువచ్చేవారని చెప్పారు. గద్దర్‌కు ప్రభుత్వం తరఫున జ్ఞానపీఠ అవార్డు, లేక అంతకు మించిన అవార్డు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి విజ్ఞప్తి చేయవలసిందిగా కోరారు.
ఇలాంటి అవార్డులు ప్రకటించడం వల్ల ఆయన పేరు జాతీయ స్థాయిలో తెలుస్తుందన్నారు. గద్దర్ పేరుపై పరిశోధన గ్రంథాలను తీసుకురావాలని కోరారు. ఆయన చిత్రాన్ని రవీంద్రభారతిలో పెడితే సముచిత గౌరవం దక్కుతుందని తెలిపారు. గద్దర్ పేరుపైన అవార్డు ఇస్తున్నామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వారం రోజుల్లో అవార్డుపై కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.