డీఎస్సీ పోస్టులపై దుష్ప్రచారం- ఎమ్మెల్సీ భూమిరెడ్డి - YSRCP SPREAD MISINFORMATION DSC - YSRCP SPREAD MISINFORMATION DSC
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 30, 2024, 2:59 PM IST
MLC Bhumireddy Fire on YSRCP Spread Misinformation About DSC Posts : ఉపాధ్యాయ పోస్టులు 16,347 భర్తీ చేస్తుంటే సహించలేక వైఎస్సార్సీపీ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది జిల్లా విద్యాశాఖ అధికారులు ఇంకా నివేదికలు తయారు చేస్తున్నారని ఆయన అన్నారు. కానీ ఇంతలోపే అన్యాయం జరిగిందంటూ వైఎస్సార్సీపీ నేతలు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని భూమిరెడ్డి మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన జీవో 117 వల్ల రాష్ట్రంలో నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఆ జీవో కారణంగానే ప్రస్తుతం ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారని భూమిరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా లెక్కలు తేల్చలేదని ఆయన విమర్శించారు. ఖాళీగా ఉన్న ప్రతి ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కచ్చితంగా ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని అభ్యర్థులెవరూ వైఎస్సార్సీపీ ట్రాప్‌లో పడొద్దని భూమిరెడ్డి సూచించారు.