LIVE అభిమానులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆత్మీయ సమావేశం- ప్రత్యక్షప్రసారం - Vasantha Krishna Prasad Live

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 1:29 PM IST

Updated : Feb 5, 2024, 1:41 PM IST

MLA Vasantha Krishna Prasad Media Conference Live: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మైలవరం నియోజకవర్గం నుంచి భారీగా ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ అధిష్ఠానం చర్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గత కొంతకాలంగా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఏలూరులో జరిగిన వైఎస్సార్సీపీ 'సిద్ధం' మహాసభకు సైతం ఆయన గైర్హాజరయ్యారు. 

ఈ పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారనే ఊహగానాలు వెలువడుతుండగా మైలవరం నియోజకవర్గపు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వసంత తన అభిప్రాయాలను వెల్లడించి కార్యకర్తలు, నాయకులు నుంచి సహకారం అడగనున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు తనకు సహకరించిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులకు కృతజ్ఞతలు తెలుపనున్నారు. ఈ సభలో వసంత తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మైలవరం నియోజకవర్గం నుంచి భారీగా వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం మీకోసం.

Last Updated : Feb 5, 2024, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.