పెద్దిరెడ్డి భూదాహానికి భూదేవి కూడా బాధపడుతోంది: ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా - MLA Varla Allegations on Peddireddy - MLA VARLA ALLEGATIONS ON PEDDIREDDY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 10, 2024, 3:35 PM IST
MLA Varla Kumarraja Allegations on MLA Peddireddy: పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామంచద్రారెడ్డి భూదాహానికి భూదేవి కూడా బాధపడుతోందని టీడీపీ ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బినామీలను పెట్టుకుని ఇష్టానుసారం దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ కూడా పెద్దిరెడ్డి బినామీల్లో ఒకరని ఆరోపించారు. మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న పెద్దిరెడ్డి పీఏ శశిధర్ హైదరాబాద్‌లో ఉండేది కైలే అనిల్‌కుమార్‌కు చెందిన ప్లాట్‌లోనేనని కుమార్‌రాజా ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్‌లో 5.35 లక్షలు వార్షిక ఆదాయమని కైలే అనిల్ కుమార్ పొందుపర్చారని కానీ పామర్రులో అనిల్ కుమార్ ఆస్తులు చూస్తే అందరూ అవాక్కవ్వాల్సిందేనని అన్నారు.
త్యాడేపల్లి ప్యాలేస్ తలదన్నేలా, హైదరాబాద్ లోటస్ పాండ్‌లో పామర్రులో అనిల్ కుమార్ ఇంద్రప్రస్థానాన్ని కట్టుకున్నారని ఆరోపించారు. 2005లో తనకు టూ వీలర్ మాత్రమే ఉందని చెప్పుకునే అనిల్‌కు నేడు 4 ఫార్చూనర్ కార్లు, పామర్రు, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, హనుమాన్ జంక్షన్‌లో ప్యాలెస్‌లు ఎలా వచ్చాయని నిలదీశారు. దళితులను చంపిన వారిని పక్కనే పెట్టుకొని తిరుగున్న జగన్ రెడ్డికి అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదని వర్ల కుమార్ రాజా విమర్శించారు.