రంపచోడవరంలో అంగన్వాడీ పిల్లలకు ఎమ్మెల్యే పాఠాలు - MLA Shirisha Visit Anganwadi Center - MLA SHIRISHA VISIT ANGANWADI CENTER

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 7:56 PM IST

MLA Miriyala Shirishadevi Visited Anganwadi Center in Reddypet: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని రెడ్డి పేట అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి సందర్శించారు. కాసేపు పిల్లలతో ముచ్చటించారు. గతంలో శిరీషాదేవి అదే కేంద్రంలో అంగన్వాడీ టీచర్​గా విధులు నిర్వహించేవారు. అయితే ఆమె భర్త విజయ భాస్కర్ తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ యూత్ అధ్యక్షులుగా పని చేయడంతో ఎమ్మెల్సీ అనంత బాబు శిరీషాదేవిపై కక్ష సాధింపులకు దిగాడు. ఈ క్రమంలో శిరీషాదేవి వైఎస్సార్​సీపీ నేతల వేధింపుల కారణంగా విధులకు రాజీనామా చేసి, రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున రంపచోడవరం నియోజకవర్గం (Rampachodavaram Constituency) నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచి విజయం సాధించారు. తాజాగా తాను పని చేసిన చోటుకే వచ్చి పిల్లలకు పాఠాలు బోధించటం అందరినీ ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత మళ్లీ పిల్లలతో కలిసి ముచ్చటించటం తనకెంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే శిరీషాదేవి అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.