రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి పరామర్శ - ₹10లక్షల ఆర్థిక సాయం అందజేత - nellore district
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 5:41 PM IST
|Updated : Jan 30, 2024, 8:06 PM IST
MLA Kotam Reddy Visited the Family Who Died in the Road Accident : నెల్లూరు నగరంలో జరిగిన 'రా కదలిరా' బహిరంగ సభకు హాజరై రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించి, ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ నెల 28న (జనవరి 28న) చంద్రబాబు భారీ సభకు హాజరై తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో జువ్వల శీనయ్య అనే వ్యక్తి మృతి చెందారు. మరో 8 మంది గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శీనయ్య కుటుంబ సభ్యులను కోటంరెడ్డి పరామర్శించారు. తక్షణ సాయంగా వారికి 10 లక్షల రూపాయలను అందజేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన ఇతరులను పరామర్శించారు. వారికి అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. తీవ్ర గాయాలైన ఇద్దరికి 50 వేలు, మరో ఆరుగురికి 10 వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు.