శవ రాజకీయాల కోసమే దిల్లీకి జగన్: జీవీ ఆంజనేయులు - GV Anjaneyulu Fires on Jagan - GV ANJANEYULU FIRES ON JAGAN
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 24, 2024, 10:42 AM IST
GV Anjaneyulu Fires on Jagan : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిల్లీ నుంచి రాష్ట్రానికి నిధులను సాధించుకొచ్చారని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం శవరాజకీయాల కోసం దిల్లీ వెళ్లారని ఆరోపించారు. తన హయాంలో ఏపీ పరువును జగన్ హస్తినలో తాకట్టు పెట్టారని విమర్శించారు. ఎందుకంటే వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధి , ఉద్యోగాలు లేవన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద జీవీ ఆంజనేయులు మాట్లాడారు.
రాష్ట్రంలో వందల హత్యలు, దాడులు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి అభూత కల్పన కల్పిస్తున్నారని జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. వైఎస్సార్సీపీలోని రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో ఓ రౌడీ ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు. ఆ హత్యను రాజకీయం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన 256 హత్యలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఆయన చర్యలను ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు. జగన్‌కి పదవీ కాంక్ష, అవినీతి తప్ప ఇంకో ఆలోచన లేదని జీవీ ఆంజనేయులు దుయ్యబట్టారు.