సినిమాతో సంబంధం లేకున్నా ఫిలిమ్ క్లబ్‌లో సభ్యులా?- రాజీనామా చేయకుంటే చర్యలు తప్పవు: గంటా - Ganta on Film Industry Development - GANTA ON FILM INDUSTRY DEVELOPMENT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 23, 2024, 10:31 AM IST
MLA Ganta Srinivasa Rao on Film Industry Development: రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి జరగకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. సినిమాకు సంబంధంలేని వ్యక్తులందరూ విశాఖ ఫిలిమ్ నగర్ (Visakha Film Nagar) కల్చరల్ క్లబ్‌లో సభ్యులుగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించి వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తులు స్వతహాగా రాజీనామా చేయాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. ఫిలిమ్ నగర్ క్లబ్‌కు ఉన్న వైఎస్సార్ పేరును సినీ అభిమానులు తొలగించారు.
"రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంది. సినిమాకు సంబంధం లేనివారు విశాఖ ఫిలిమ్ నగర్ కల్చరల్ క్లబ్‌లో సభ్యులుగా ఉన్నారు. రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించి వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తులు స్వతహాగా వారు రాజీనామా చేయకుంటే చర్యలు తప్పవు." - గంటా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే