పబ్లిసిటీ కోసం భరత్ నిప్పు పెట్టుకున్నారు : ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు - MLA Adireddy Srinivas comments - MLA ADIREDDY SRINIVAS COMMENTS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 6, 2024, 3:19 PM IST

MLA Adireddy Srinivas Comments on YCP Campaign Chariot Burning : రాజమహేంద్రవరంలో వైసీపీ ప్రచారం రథం దగ్దమైన ఘటన ఎన్నికల తర్వాత కూడా రాజకీయ వేడి రగిలిస్తోంది. ప్రచార రథానికి భరతే నిప్పుపెట్టుకుని తమపై బురద జల్లుతున్నారని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విమర్శించారు. నటనలో ఆరితేరిన భరత్ పబ్లిసిటీ కోసం చేసిన స్టంటే ప్రచార రథం దగ్దమని ఎద్దేవా చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఉపేక్షించబోమన్నారు. అధికారంలో ఉన్నది ఎన్డీయే కూటమి ప్రభుత్వామని నిందితులు ఎవరైనా వదలబోమని హెచ్చరించారు.

ఎన్నికల సమయంలో మాజీ ఎంపీ భరత్ ప్రచార రథం దగ్ధమైన ఘటన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది. మార్గాని ఎస్టేట్లో భరత్ ప్రచార రథం తగలబడినప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. సింపతి కోసమే వైఎస్సార్సీపీ నేతలు రథాన్ని తగులబెట్టుకున్నారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. దీనివెనుక భారీ కుట్ర ఉందని వెల్లడించారు. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తనే ప్రచార రథానికి నిప్పు పెట్టారని పోలీసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజమండ్రి రాజకీయం ఒక్కసారిగా రంజుగా మారింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.