అవినీతికి పాల్పడితే ఓటు వేయకండి - మంత్రి బొత్స అసక్తికర వ్యాఖ్య - బొత్స సత్యనారాయణ స్పీచ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 9:10 PM IST
Minster Botsa Satyanarayana: రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఒక్కసారిగా అలా మాట్లాడిన మాటలకు సభ ప్రాగంణంలోని ప్రజలందరూ అవాక్కయ్యారు. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో వైఎస్సార్ ఆసరా నిధుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులు, వైఎస్సార్సీపీకి చెందిన జిల్లా ఇతర ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేతలు ఎవరైనా అవినీతికి పాల్పడితే వారికి ఓటేయకండి అని మంత్రి బొత్స ప్రజలకు సూచించారు. అసలు అవినీతికి పాల్పడిన వారికి ఓటు ఎందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. కొన్ని వార్త ఛానాళ్లు ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పాటు, నేతలపై, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
"ఎవరైనా అవినీతి చేసినా, మీరు ఓటు వేయాల్సిన అవసరం లేదు. మేము అవినీతి చేసినప్పుడు ఓటు ఎందుకు వేయాలి. మేము తప్పు చేసినప్పుడు ఓటు ఎందుకు వేయాలి. ఓటు వేయాల్సిన అవసరం లేదు." - బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి