మనవరాలిపై తాత అత్యాచారం - గర్భందాల్చడంతో విషయం వెలుగులోకి - Rapes against women in AP
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 7:57 PM IST
Minor Girl Raped By Grandfather : ఓ బాలికపై వరుసకు తాతయ్యే వ్యక్తి అత్యాచారం చేసి గర్భవతిని చేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మోపిదేవి గ్రామంలోని హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాలికకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆ బాలిక నాలుగు నెలల గర్బిణిగా గుర్తించారు.
మెరుగైన వైద్య చికిత్స కోసం వైద్యులు ఆ బాలికను మచిలీపట్నం ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. బాలికను కుటుంబ సభ్యులు విచారించగా, ఇంటి పక్కన ఉండే వరసకు తాతయ్య అయ్యే ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పినట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ బాలిక ఇంటి వద్ద విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, విచారణ అనంతరం అన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపారు.