మద్యం మత్తులో అత్త మామలపై దాడి చేసిన మైనర్​ బాలుడు - Minor Boy Attack At Vanasthalipuram

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Mar 14, 2024, 5:38 PM IST

Minor Boy Attack At Vanasthalipuram : మద్యం, డ్రగ్స్ మత్తులో దారుణానికి పాల్పడుతున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బంధుత్వాలు మరచి ఎంతటి దారుణానికి ఒడికడుతున్నారు. తాజాగా హైదరాబాద్​లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోనీ గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. సొంత మేనల్లుడే అత్త, మామ పై కత్తితో దాడి చేశాడు. స్థానికంగా ఉంటున్న ప్రియ, చిరంజీవిల మేనల్లుడైన మైనర్ బాలుడు, గంజాయి మత్తులో చెడు వ్యసనాలకు అలవాటు పడి జులాయిగా తిరుగుతున్నాడని స్థానికులు ఫిర్యాదు చేశారు. గంజాయి సేవించడం మాని బుద్ధిగా ఉండాలని ఇవాళ అత్త మామలు మందలించారు. వెంటనే ఆవేశంలో ఆ మైనర్ బాలుడు వారిద్దరిపై దాడి చేశాడు. వెంటనే స్థానికులు వారిని అంబులెన్స్​లో వనస్థలిపురం హాస్పిటల్​కి తరలించారు. 

Boy Attacked His Aunt And Uncle : బాలుడికి గంజాయి గ్యాంగ్​లతో సంబంధాలు ఉన్నట్లు కాలనీ వాసులు తెలిపారు. గతంలోనూ బాలుడిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు మైనర్​ కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా మందలించి వదిలేశారు. అయినా తీరు మార్చుకోకుండా మరోసారి దాడికి పాల్పడ్డాడు. ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న బాలుడు కోసం గాలిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.