చంద్రబాబు ఆదేశాలతో ఎన్టీఆర్ భవన్‌కు మంత్రులు - వినతుల స్వీకరణ - Ministers Received Requests - MINISTERS RECEIVED REQUESTS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 13, 2024, 7:07 PM IST
Ministers Received Requests from People at NTR Bhavan: ప్రజల సమస్యలు తీర్చేందుకు అమాత్యులందరూ కష్టపడాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను మంత్రులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్రకార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అందుబాటులో ఉండాలన్న సూచనలతో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లారు. పార్టీ కార్యాలయం రిసెప్షన్ వద్దే కూర్చుని ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. వీరు వచ్చే వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఎమ్మెల్సీ అశోక్ బాబు స్వీకరించారు. ప్రజలు, కార్యకర్తలు ఇచ్చిన వినతులను తీసుకుని సమస్యల పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. వినతులను స్వీకరించిన వెంటనే సంబంధిత అధికారులకు అనగాని సత్య ప్రసాద్ ఫోన్లు చేసి ఆరా తీశారు. బాధితుల వివరాలు, ఫోన్ నెంబర్ చెప్పి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. సమస్య పరిష్కారమైందో లేదో తనకు అప్‌డేట్ ఇవ్వాలని మంత్రి అనగాని స్పష్టం చేశారు.