LIVE : హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం - Minister Uttam Kumar PC Live
🎬 Watch Now: Feature Video
Published : Feb 5, 2024, 7:11 PM IST
|Updated : Feb 5, 2024, 7:22 PM IST
Minister Uttam Kumar Reddy Press Meet Live in Hyderabad Today : రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగిస్తోందని బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యవహారంపై మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్ రావు వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ ఖండించారు. రాష్ట్ర సర్కార్ ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో గత కేసీఆర్ సర్కార్ తీవ్రంగా అక్రమాలకు పాల్పడిందని మరోసారి ఆరోపించారు. కేసీఆర్ బండారం అసెంబ్లీ సమావేశాల్లో బయటపడుతుందని విమర్శించారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు త్వరలో అమలు చేయబోయే మరో రెండు గ్యారంటీ పథకాల అమలుపైనా ఈ ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.