మీకు మీరే మంచివారని సర్టిఫికెట్లా ? - కేటీఆర్​కు మంత్రి సత్యకుమార్‌ కౌంటర్ - Minister Satya Kumar Fires on KTR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 2:26 PM IST

thumbnail
కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు సత్యకుమార్‌ సమాధానం (ETV Bharat)

Minister Satya Kumar Fires on KTR : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​పై మంత్రి సత్యకుమార్ విమర్శలు గుప్పించారు. ఏపీలో జగన్, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎందుకు ఓడిపోయారో తెలియటం లేదని ఆయన మాట్లాడిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మంచివారని మీకు మీరే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. ధర్మవరంలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో సత్యకుమార్ పాల్గొని మాట్లాడారు. 

Satya Kumar Counter to KTR : తెలంగాణలో నివాసం ఉంటున్న మాజీ మంత్రి కేటీఆర్, ధర్మవరంలో ఎవరికైనా ఫోన్ చేసి అడిగితే ఇక్కడి పరిస్థితి తెలిసేదని సత్యకుమార్ అన్నారు. వారే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎందుకు ఓడిపోయారో చెబుతారని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్​ను, ఏపీలో వైఎస్సార్సీపీని ప్రజలు ఇంటికి సాగనంపారని తెలిపారు. ప్రజా వ్యతిరేకపాలన చేసిన తమకు తగిన గుణపాఠం చెప్పారని సత్యకుమార్ వ్యాఖ్యానించారు. 

ఒకరికొకరు మంచి వారని సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారని సత్యకుమార్ అన్నారు. ఇక ఐదేళ్లు వారు ఓదార్పులు చేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్​పై నాలుగేళ్ల క్రితం తాను మాట్లాడితే, తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా బ్లాక్ చేశారని చెప్పారు. రాజకీయ విమర్శలను కూడా ఆయన జీర్ణించుకోలేదని సత్యకుమార్ వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.