పెద్దిరెడ్డి బాగోతం బయటపెడతాం- జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేడు: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి - Minister Ramprasad on Peddireddy - MINISTER RAMPRASAD ON PEDDIREDDY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 21, 2024, 6:51 PM IST
Minister Ramprasad Reddy angry on former minister Peddireddy: చేసిన పాపాలకు జైలుకు వెళ్లకుండా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పించుకోలేడని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. పెద్దిరెడ్డి విముక్త రాయలసీమే ప్రజలకు గొప్ప వరమని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి హత్యలు దోపిడీలు దాడులు లేకుండా సీమ ప్రజలు సంతోషంగా బ్రతుకుతారన్నారు. త్వరలో సాక్ష్యాధారాలతో పెద్దిరెడ్డి బాగోతం బయటపెడతామని వెల్లడించారు. ప్రాజెక్టుల పేరుతో పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ప్రజా ధనాన్ని కొల్లగొట్టారని రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షాధారాలతో సహా పెద్దిరెడ్డి బాగోతం బయటపెడతామని చేసిన పాపాలకు జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేరని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. పెద్దిరెడ్డిని రాయలసీమ నుంచి తరమికొట్టి ఆ ప్రాంతానికి, అక్కడి ప్రజలకు విముక్తి కల్పించాలని అన్నారు. ఇప్పటి వరకు పెద్దిరెడ్డి అరాచకాల వల్ల అక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఇప్పడు వారికి ఇంక ఎలాంటి సమస్యలు ఉండవని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.