జగన్ కేసుల కోసం దిల్లీ వెళ్లేవారు- చంద్రబాబు పర్యటనలతోనే రాష్ట్రానికి నిధులు : పయ్యావుల - Payyavula kesav on cbn

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 5:27 PM IST

thumbnail
Minister Payyavula Keshav Says About CM Chandhababu Delhi Tour : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున సాయం చేస్తుండటం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వ సమర్థతకు నిదర్శనమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పోలవరం మొదటి దశకు రూ. 12వేల కోట్లకు పైగా నిధులు మంజూరు కావడం చంద్రబాబు ఘనతేనని గుర్తుచేశారు. నిధులు సాధించిన చంద్రబాబుకు మంత్రి వర్గం తరఫున అభినందనలు చెప్పినట్లు పయ్యావుల తెలిపారు. చంద్రబాబు తొలి దిల్లీ పర్యటనలో అమరావతికి నిధులు వచ్చాయని, రెండో పర్యటనతో జలవనరులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులు, మౌలిక వసతులకు 2వేల 500కోట్లు రాష్ట్రానికి వచ్చాయని గుర్తుచేశారు. ఎన్డీయే (NDA)కి అఖండ విజయం అందించిన ప్రజలు ఆ ఫలితాలను ఇప్పుడు చూస్తున్నారని అన్నారు. ఐదేళ్ల విధ్వంస పాలనలో అల్లాడిన రాష్ట్రానికి చంద్రబాబు రాకతో కొత్త ఊపిరి అందిందన్నారు. గతంలో కేసుల కోసం జగన్​ దిల్లీకి వెళ్లేవారని, చంద్రబాబు మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం దిల్లీ వెళ్లడాన్ని ప్రజలు చూస్తున్నారని అన్నారు. (ETV Bharat)

Minister Payyavula Keshav Says About CM Chandhababu Delhi Tour :  రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున సాయం చేస్తుండటం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వ సమర్థతకు నిదర్శనమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పోలవరం మొదటి దశకు రూ. 12వేల కోట్లకు పైగా నిధులు మంజూరు కావడం చంద్రబాబు ఘనతేనని గుర్తుచేశారు. నిధులు సాధించిన చంద్రబాబుకు మంత్రి వర్గం తరఫున అభినందనలు చెప్పినట్లు పయ్యావుల తెలిపారు. 

చంద్రబాబు తొలి దిల్లీ పర్యటనలో అమరావతికి నిధులు వచ్చాయని, రెండో పర్యటనతో జలవనరులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులు, మౌలిక వసతులకు 2వేల 500కోట్లు రాష్ట్రానికి వచ్చాయని గుర్తుచేశారు. ఎన్డీయే (NDA)కి అఖండ విజయం అందించిన ప్రజలు ఆ ఫలితాలను ఇప్పుడు చూస్తున్నారని అన్నారు. ఐదేళ్ల విధ్వంస పాలనలో అల్లాడిన రాష్ట్రానికి చంద్రబాబు రాకతో కొత్త ఊపిరి అందిందన్నారు. గతంలో కేసుల కోసం జగన్​ దిల్లీకి వెళ్లేవారని, చంద్రబాబు మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం దిల్లీ వెళ్లడాన్ని ప్రజలు చూస్తున్నారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.