గంపలను నెత్తిన పెట్టుకొని- అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల పనుల్లో ఏపీ మంత్రి - Nimmala Involved Idol Works
🎬 Watch Now: Feature Video
Minister Nimmala Ramanaidu Sramadanam : పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం ఆర్యపేటలో అంబేడ్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాల పైకప్పు నిర్మాణ పనుల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. స్వయంగా మంత్రే ఇసుక, కంకర గంపలను నెత్తి మీద పెట్టుకుని కార్మికులతో కలసి శ్రమదానం చేశారు. భవిష్యత్తులో నియోజకవర్గం వ్యాప్తంగా మహనీయుల విగ్రహాల సంరక్షణకు దాతల సహకారంతో స్లాబ్ పనుల్లో శ్రమదానం చేస్తానని మంత్రి తెలిపారు. అంబేడ్కర్, మదర్ థెరీసాల స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇసుక, గనులు, లిక్కర్, భూముల కబ్జాలకు ప్రాధాన్యత ఇస్తే తమ ప్రభుత్వం రైతులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి రామానాయుడు అన్నారు. యలమంచిలి లంక గ్రామంలో పశువుల దాణాను ఆయన రైతులకు పంపిణీ చేశారు. జగన్ ప్రభుత్వం అన్నదాతలను తాకట్టు పెట్టేందుకు పౌర సరఫరాలపై రూ.35 వేల కోట్లు అప్పు తెచ్చిందని విమర్శించారు. వైఎస్సార్సీపీ రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి రూ.1634 కోట్లు ఎగ్గొడితే కూటమి ప్రభుత్వం ఆ డబ్బులను రైతులు ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. ఇప్పటికే వెయ్యి కోట్లు జమ చేశామని మిగిలిన రూ.634 కోట్లు వారం రోజుల్లో వేస్తామన్నారు.