ఫెర్రీ ఘాట్ వద్ద జలహారతి - కృష్ణమ్మ చెంతకు గోదావరి జలాలు - Jalaharati Program at Sangam - JALAHARATI PROGRAM AT SANGAM
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 8, 2024, 4:41 PM IST
Minister Nimmala Conducted Jalaharati Program at Sangam Point: పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా వందల కిలోమీటర్లు ప్రయాణించిన గోదావరి జలాలు కృష్ణమ్మ ఒడిలో చేరాయి. విజయవాడలోని ఫెర్రీ ఘాట్ సమీపంలో గోదావరి, కృష్ణా జలాలు కలిసే పవిత్ర సంగమం పాయింట్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ కేశినేని చిన్ని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి నిమ్మల పూజలు చేశారు. కృష్ణా డెల్టా ఆయకట్టుకు బుధవారం నుంచి కాలువల ద్వారా నీరు విడుదల చేసే అవకాశం ఉందని మంత్రి నిమ్మల చెప్పారు.
Minister Nimmala Release Water: కొద్దిరోజుల క్రితం పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు మంత్రి నిమ్మల నీటిని విడుదల చేశారు. మోటార్లు, యంత్రాలకు పూజలు చేసిన అనంతరం సాగు, తాగునీటిని వదిలారు. దేశాన్ని కరవు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది చంద్రబాబేనని నిమ్మల అన్నారు.