ఈ నెల 15న అన్న క్యాంటీన్ల ప్రారంభం- కేవలం రూ.5కే రుచికరమైన భోజనం - Minister Narayana on Anna Canteens - MINISTER NARAYANA ON ANNA CANTEENS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-08-2024/640-480-22188236-thumbnail-16x9-minister-narayana-on-anna-canteens-reopen.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 12, 2024, 8:59 PM IST
Minister Narayana on Anna Canteens Reopen: ఈ నెల 15వ తేదీన రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని వెల్లడించారు. ఆగస్టు 15న సాయంత్రం ఆరున్నర గంటలకు ఉయ్యూరులో అన్న క్యాంటీన్ చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. ఆగస్టు 16వ తేదీన మిగిలిన 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారన్నారు.
గతంలో మాదిరిగానే కేవలం 5 రూపాయల చొప్పున భోజనం, టిఫిన్లను అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడా ధర పెంచడం లేదని, అన్ని అన్న క్యాంటీన్లు ఒకే మోడల్‌లా ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. దాదాపు 2.25 లక్షల మంది అన్నార్థుల ఆకలి తీర్చేలా అన్నా క్యాంటీన్లను మొదలు పెడుతున్నామన్నారు. మొత్తం 203 క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు.