పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం : మంత్రి నారా లోకేశ్ - NARA LOKESH ON YUVAGALAM PROMISES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2024, 7:53 PM IST
Minister Nara Lokesh on Yuvagalam Padayatra Promises: యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం అన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని బ్రాహ్మణులు పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి తెచ్చారని గుర్తుచేశారు. వారికి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ధూప, దీప నైవేద్య సాయం 10 వేలకు పెంచామన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని 5400 చిన్న ఆలయాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడి సేవకు ఆస్కారం ఏర్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా మాది అరాచక ప్రభుత్వం కాదని ప్రజలందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం తమదని మంత్రి పేర్కొన్నారు. అలానే ముందు ముందు కూడా ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు.