క్రీడా సాధికార సంస్థపై మంత్రి మండిపల్లి సమీక్ష - వైఎస్సార్సీపీ అవినీతి, అక్రమాలపై ఆరా - Review on AP Sports Authority - REVIEW ON AP SPORTS AUTHORITY
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 12, 2024, 1:58 PM IST
Minister Mandipalli Review on AP Sports Authority: రాష్ట్ర క్రీడా సాధికార సంస్థపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో శాప్ ఎండీ గిరీశా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాయంత్రం రవాణా, ఆర్టీసీతో పాటు క్రీడలపై సీఎం చంద్రబాబు సమీక్ష నేపథ్యంలో కసరత్తులు చేస్తున్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో శాప్‌లో అవినీతి, అక్రమాలపై మంత్రి ఆరా తీశారు. క్రీడా శాఖలో సమస్యలు సహా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల ప్రజెంటేషన్ ఇచ్చారు.
కాగా సీఎం చంద్రబాబు సచివాలయంలో ఇవాళ సాయంత్రం వివిధ అంశాలపై సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి నేరుగా సచివాలయానికి రానున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తదితర అంశాలపై చర్చించనున్నారు. సచివాలయంలో వైద్య-ఆరోగ్య, రవాణా, యువజన, క్రీడల శాఖలపై సమీక్షించనున్నారు. నూతన పారిశ్రామిక విధానంపైనా సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించనున్నారు.