అక్కా చెల్లెమ్మలకు లోకేశ్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు - Rakhi Celebration At Undavalli - RAKHI CELEBRATION AT UNDAVALLI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 19, 2024, 5:30 PM IST
Rakhi Celebration At Undavalli : మహిళా సంక్షేమం, భద్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఉండవల్లి నివాసంలో నిర్వహించిన రాఖీ పౌర్ణమి వేడుకల్లో తెలుగు మహిళలు పాల్గొన్నారు. నారా లోకేశ్‌కు హారతి ఇచ్చి రాఖీలు కట్టారు. అక్కా చెల్లెమ్మలకు లోకేశ్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు అన్ని విధాల అండగా నిలిచామని గుర్తుచేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మంగళగిరి నియోజకవర్గంలో
Minister Lokesh Rakhi Celebration : మహిళల స్వయం ఉపాధికి కృషిచేశామని చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, మాజీ మంత్రి పీతల సుజాత, టీడీపీ డ్వాక్రా అంగన్ వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీతతో పాటు పలువురు మహిళలు నారా లోకేశ్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.