ప్రజలకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే -మంత్రి లోకేశ్ - Lokesh participated in Rath Yatra - LOKESH PARTICIPATED IN RATH YATRA
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 11, 2024, 10:33 PM IST
Minister Lokesh Participated in Jagannath Rath Yatra Organized in Mangalagiri : దేశం మొత్తం మంగళగిరి వైపు చూస్తోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. జగన్నాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బంగారు చీపురుతో రోడ్డు ఊడ్చి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం భక్తులతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. పెదకాకానిలో విద్యార్ధులు నిర్వహించిన జగన్నాధ రథయాత్ర ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదైంది. ఆ పత్రాన్ని నారా లోకేశ్ చేతుల మీదుగా ఇస్కాన్ ప్రతినిధులకు అందజేశారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనని తన తాత ఎన్టీ రామారావు, తన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి తనకు చిన్నప్పుడు నుంచి నేర్పించారని గుర్తుచేశారు. అదే బాటలో తాను ప్రజాసేవనే దైవ సేవగా భావిస్తున్నానని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చడానికి భగవంతుడు తనకు శక్తి సామర్థ్యం ఇవ్వాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు. ప్రస్తుతం భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూస్తుందన్నారు.