100 రోజుల్లో రాష్ట్రంలో గంజాయి విక్రయాలకు చెక్ పెడతాం: మంత్రి లోకేశ్ - Minister Lokesh in Bakrid Prayer - MINISTER LOKESH IN BAKRID PRAYER
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 17, 2024, 7:44 PM IST
Minister Lokesh Participated Bakrid Prayer Held in Mangalagiri: రాష్ట్రంలో వంద రోజుల్లో గంజాయి విక్రయాలకు చెక్ పెడతామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి ఈద్గాలో జరిగిన బక్రీద్ ప్రార్థనలో లోకేశ్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదర్బారు ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబుతో చర్చించి ప్రజాదర్బారు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముగ్గురు కార్యకర్తలను వైఎస్సార్సీపీ నేతలు హత్య చేసినా తాము సంయమనం పాటిస్తున్నామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
తన సమస్య పరిష్కారానికి మంత్రి నారా లోకేశ్ హామీ ఇవ్వడంతో ఏలూరుకు చెందిన అనూష హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరిలో నిర్వహించిన ప్రజాదర్బారులో ఆమె లోకేశ్‌ను కలిసి సమస్యను విన్నవించారు. తన ఇంటిని వైఎస్సార్సీపీ నాయకుడు కబ్జా చేశారని యువగళం పాదయాత్రలో లోకేశ్‌ను కలిసి ఆమె సమస్యను చెప్పుకుంది. ఆ విషయాన్ని లోకేశ్ గుర్తించి తన సమస్య పరిష్కారంపై భరోసా ఇచ్చారని అనూష వెల్లడించారు.