జిల్లా స్థాయి అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష - Ravindra Meeting With Authorities - RAVINDRA MEETING WITH AUTHORITIES

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 19, 2024, 4:24 PM IST

Minister Kollu Ravindra Meeting With Authorities: కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్​లో వివిధ అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో మైన్స్ అండ్‌ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష చేపట్టారు. నియోజకవర్గ సమస్యలపై మంత్రి కొల్లు రవీంద్ర పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. సమీక్షకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, డీఆర్ఓ చంద్రశేఖర్, ఆర్డీఓ వాణి హాజరయ్యారు. గత ఐదేళ్లుగా కాలువల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించకపోవడంపై ఇరిగేషన్ అధికారులపై మంత్రి రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ శాఖల్లో పెండింగ్ పనులపై ఆయన ఆరా తీశారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆయన ఆదేశించారు. గ్రామాల్లో అప్రకటిత విద్యుత్ కోతలను నివారించాలని ట్రాన్స్​కో అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 

అంతకుముందు మంత్రి రవీంద్ర కూటమి నేతలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ నేతల్ని భాగస్వామ్యం చేసేందుకే భేటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 50 వేల కోట్ల విలువ చేసే ఆయిల్ రిఫైనరీ మచిలీపట్నం రానుందని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో మచిలీపట్నంలో లక్ష జనాభా పెరుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.