ఇకనైనా శ్రీకాకుళం జీజీహెచ్​లో పరిస్థితులు మారాలి - అవసరమైన నిధులు తీసుకువస్తా : మంత్రి అచ్చెన్నాయుడు - Review Meeting on Srikakulam GGH - REVIEW MEETING ON SRIKAKULAM GGH

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 19, 2024, 10:28 AM IST

Minister Kinjarapu Achchennaidu Review Meeting on Srikakulam GGH : శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఇకనైనా పరిస్థితులు మారాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైద్యులను హెచ్చరించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్​తో కలసి జీజీహెచ్​లో మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలోనే ఆదర్శ ఆసుపత్రిగా జీజీహెచ్​ను తీర్చి దిద్దడానికి అందరూ కలిసి కట్టుగా పని చేయాలన్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్న అచ్చెన్నాయుడు, అందుకు అవసరమైన నిధులు తీసుకువస్తామన్నారు. 

అలాగే పని చేయని లిఫ్ట్​లు తక్షణమే బాగు చేయించాలని, ఓపీ విభాగం వద్ద కుర్చీలు, ఫ్యాన్లు, వార్డుల్లో ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేయాలని సూచించారు. రోగులకు పెట్టే భోజనంపై ఆరా తీశారు. నాణ్యత బాగో కుంటే గుత్తేదారును మార్చి కొత్తవారిని నియమించాలని సూచించారు. అంబులెన్స్ నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో డిమాండు చేయడం దారుణమన్నారు. చివరికి పోస్టుమార్టానికి సైతం డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని, అలాంటి వారిని విధుల నుంచి తొలగించాలని చెప్పారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల నియామకాలపై ఆరా తీశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 315 పోస్టులే మంజూ రైతే 365 మందిని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. సిబ్బంది కొరతతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.