మదనపల్లె ఘటన ప్రమాదం కాదనే నిర్ధరణకు వచ్చాం-మంత్రి అనగాని - Madanapalle Fire Accident - MADANAPALLE FIRE ACCIDENT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 23, 2024, 10:42 PM IST
Anagani Satya Prasad on Madanapalle Fire Accident : మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటన ప్రమాదం కాదనే నిర్ధారణకు వచ్చామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు. దీని వెనుక ఉన్నవారిని ఎంతమాత్రం ఉపేక్షించమని ఆయన హెచ్చరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైనే అన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్షపడే విధానంగానే ప్రభుత్వ చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
ప్రజల భూములు చట్టబద్ధంగా లాక్కునేందుకు వైఎస్సార్సీపీ తెరలేపిన కుట్రలో భాగమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని రెవెన్యూ శాఖ మంత్రి ధ్వజమెత్తారు. నీతి ఆయోగ్ సిఫార్సులకు భిన్నంగా నిబంధనలు రూపొందించారని ఆయన విమర్శించారు. ఇవాళ బిల్లును ప్రవేశపెట్టామని, దీనిపై బుధవారం చర్చ జరిగుతుందని తెలిపారు.
రాష్ట్రానికి ఒకటే రాజధాని, అది కూడా అమరావతే అని నిర్ధారిస్తూ ఇవాళ కేంద్రం నిధులు కేటాయించిందని తెలిపారు. రాష్ట్రానికి ఈరోజు శుభదినంగా పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయించడం ప్రజలందరూ ఆనందపడే అంశమని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని మోదీ ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్నారు. ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.