'జగన్ మావయ్య మా ఆకలి కేకలు వినిపించవా' - పెద్దతిప్పసముద్రం హైస్కూల్ విద్యార్థుల ఆవేదన - పెద్ద తిప్పసముద్రం హైస్కూల్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 4:02 PM IST
Mid Day Meals Stopped in Peddathippa Samudram High School: 'నేను ఉన్నాను నేను విన్నాను' అని కబుర్లు చెప్పే జగన్ మావయ్యకు మా ఆకలి కేకలు తెలియటం లేదా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు (School Students) ఉచితంగా భోజనం అందించే మధ్యాహ్న భోజన పథకానికి సకాలంలో బిల్లులు చెల్లించకపోవటంతో భోజనాన్ని (Mid Day Meal) నిలిపివేశారు. దీంతో ఒకరు కాదు, ఇద్దరు కాదు 442 మంది విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు.
Due To Non-Payment Of Bills: అన్నమయ్య జిల్లా పెద్ద తిప్పసముద్రం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని అధికారులు నిలిపివేశారు. భోజనం లేకపోవటంతో 442 మంది విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. దాదాపు ఎనిమిది నెలలుగా బిల్లులు (bills) రాలేదంటూ నిర్వాహకులు మధ్యాహ్న భోజనం ఆపేశారు. పాఠశాలలో వంట చేసేందుకు నిర్మించిన గదికి కూడా తాళాలు వేశారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎంపీడీవో, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.