మూడు పార్టీల కలయిక శుభపరిణామం - కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు - CHIRANJEEVI SUPPORTS NDA - CHIRANJEEVI SUPPORTS NDA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 21, 2024, 11:39 AM IST
Chiranjeevi Supports TDP Janasena BJP Alliance: జనసేన, తెలుగుదేశం, బీజేపీ మూడు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడటం మంచి పరిణామమని ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి వెల్లడించారు. తన సోదరుడు పవన్ కల్యాణ్, చంద్రబాబు, బీజేపీ నాయకత్వం వల్లే చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
అనకాపల్లి లోక్‌సభ కూటమి అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో ఆయనను కలిశారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్, అదే పార్లమెంట్ పరిధిలోని పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంచకర్ల రమేష్ పోటీ చేయడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. ఇద్దరూ చాలా మంచి వాళ్లని, నియోజకవర్గాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి, సీఎం రమేష్, పంచకర్ల రమేష్‌ని గెలిపించాలని ప్రజలను కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలనేది తన పెద్ద కోరిక అని, అందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.