'ఇచ్చిన హామీలు విస్మరించడంలో ఇద్దరూ ఇద్దరే': వామపక్ష నేతలు - వామపక్ష నేతలు భేటీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 7:01 PM IST
Media Conference of Left Parties in Vijayawada : మోదీ ప్రభుత్వం పదేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు విమర్శించారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో జగన్ పోటీలు పడీ అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన వామపక్ష పార్టీల మీడియా సమావేశంలో ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, శ్రీనివాసరావు మాట్లాడారు.
ఇచ్చిన హామీలు అమలు విషయంలో ఇద్దరూ ఇద్దరే, ప్రజలను మోసం చేస్తున్నారని వామపక్షనేతలు ఆరోపించారు. నిత్యావసర ధరలు తగ్గించే విషయంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ప్రాంతీయ పార్టీలను భయపెట్టి, బెదిరించి ఎన్డీఏలోకి చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఎన్డీఏలోకి తిరిగి చేరాలని నిర్ణయం తీసుకోవడం వల్ల టీడీపీ తన మరణ శాసనం రాసుకుందని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. అర్ధరాత్రి అమిత్ షాతో జరిగిన చర్చల సారాంశాన్ని చంద్రబాబు స్పష్టం చేయాలన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు బీజేపీతో ఎలా కలుస్తున్నారని ప్రశ్నించారు. ఈ నెల 20న విజయవాడలో జరిపే సదస్సులో బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ నేతలంతా హాజరవుతారని అన్నారు. ఆ సదస్సులో తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.