LIVE: కర్ణాటకలోని చిక్​బళ్లాపురలో మార్గదర్శి నూతన బ్రాంచ్ ప్రారంభం - ప్రత్యక్షప్రసారం - Margadarsi 115th New Branch - MARGADARSI 115TH NEW BRANCH

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2024, 10:58 AM IST

Updated : Oct 7, 2024, 11:27 AM IST

Margadarsi 115th New Branch Opening in Karnataka : తెలుగువారికి సుపరిచితమైన మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ కర్ణాటకలోని చిక్​బళ్లాపూర​ మరో నూతన బ్రాంచ్‌ను ఇవాళ ప్రారంభించింది. మార్గదర్శి సంస్థకు మొత్తంగా 115వ బ్రాంచ్‌ ఇది. ఈ ప్రారంభ కార్యక్రమంలో మార్గదర్శి సంస్థకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్గదర్శి సంస్థలో చిట్స్‌ వేయడం ఎంతగానో ఉపయుక్తంగా ఉందని ఖాతాదారులు స్పష్టం చేశారు.  బ్యాంకులతో పోలిస్తే సులభంగా తాము డబ్బును పొందుతున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తమకు ఆర్థిక అండగా నిలిచిందని కొనియాడారు.  వేల కుటుంబాలు చిట్స్ కడుతున్నాయన్న ఖాతాదారులు డబ్బు తీసుకునేటప్పుడు తమకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని తేల్చి చెప్పారు. మార్గదర్శి సంస్థకు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు. జీవితంలో ప్రతి ఒక్కరు పొదుపు పాటించినట్లయితే ఆర్థికపరంగా ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ అధికారులు చెబుతున్నారు. కర్ణాటకలోని చిక్​బళ్లాపూర మార్గదర్శి సంస్థ. 
Last Updated : Oct 7, 2024, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.