కూంబింగ్ పోలీసులే లక్ష్యం - ఏవోబీ సరిహద్దులో మావోయిస్టు డంపు లభ్యం - Maoist dump unearthed - MAOIST DUMP UNEARTHED
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 25, 2024, 3:42 PM IST
Maoist Dump Unearthed from Odisha Andhra Pradesh Border: ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దులో అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు మావోయిస్టు డంప్‌ను గుర్తించారు. జీకే వీధి మండలం పనస బంద్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించిన పోలీసులు, మావోయిస్టు డంపును గుర్తించినట్లు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. ఈ డంప్ చత్తీస్గడ్, ఒడిస్సా మావోయిస్టులదిగా భావిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. కూంబింగ్ పోలీసులను టార్గెట్ చేసుకుని ఈ డంప్ పెట్టినట్లు చెప్పారు. క్యారియర్, ఎలక్ట్రిక్ బాంబ్ బ్లాస్టింగ్ సామాగ్రి వివరాలు వెల్లడించారు.
ఇకనైనా మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వంతో పాటుగా పోలీసుల నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మావోయిస్టుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపారు. ప్రజాజీవనానికి ఇబ్బందులు కలిగిస్తే ఎట్టిపరిస్థితిల్లో ఊరుకోబోమని ఎస్పీ తెలిపారు. ఎన్నికలు, ఓట్ల లెక్కింపు దృష్యా ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మావోయిస్టుల డంప్‌ను పట్టుకున్న పోలీసు బృందానికి తుహిన్ సిన్హా పారితోషకం, ప్రశంసా పత్రం ఇచ్చి అభినందించారు.