వర్గీకరణ పూర్తయ్యే వరకు నియామకాలు చేపట్టొద్దు - ప్రభుత్వాలకు మందకృష్ణ రిక్వెస్ట్ - MANDA KRISHNA ON SC VERIDCT - MANDA KRISHNA ON SC VERIDCT
🎬 Watch Now: Feature Video
Published : Aug 1, 2024, 2:35 PM IST
Manda Krishna On SC ST Sub Classification : ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో న్యాయం, ధర్మం కోసం 20 ఏళ్లుగా పోరాటం చేసి విజయం సాధించామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పునకు లోబడి రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విద్యా, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తీర్పుపై మళ్లీ కోర్టుకు వెళ్లవద్దని ఎస్సీ ఉపకులాలను ఆయన కోరారు. వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని ప్రభుత్వాలను కోరారు.
‘‘ఉద్యమంలో ప్రాణాలర్పించిన ఎమ్మార్పీఎస్ నేతలకు ఈ విజయం అంకితం చేస్తున్నాం. ప్రక్రియ వేగవంతానికి చొరవ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఏనాడైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబర్ 5న చెప్పా. అధర్మం తాత్కాలికమైనా.. ధర్మమే గెలుస్తుందని చెప్పా. మాకు అనుకూలంగా తీర్పునిచ్చిన జడ్జిలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఉమ్మడి ఏపీలో ఎస్సీ వర్గీకరణ చేసింది సీఎం చంద్రబాబే. ప్రస్తుతం అనుకూల తీర్పు వచ్చిన సందర్భంలోనూ సీఎంగా ఉన్నది ఆయనే. ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు.’’ అని మందకృష్ణ మాదిగ తెలిపారు.