ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య- సెల్ఫీ వీడియో వైరల్ - తాడిపత్రిలో ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 3:32 PM IST

Man suicide Attempt Taking a Selfie Video to Financial Problems: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. తాను ఎదుర్కొంటున్న సమస్యలను సెల్ఫీ వీడియోలో వివరించి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే తాడిపత్రికి చెందిన రంగనాయకులు అనంతపురం శివారు బళ్లారి రోడ్డు సమీపంలో ఉన్న కోకో కోల హేమ ఏజెన్సీ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఏజెన్సీ తరఫున తక్కువ ధరకు అమ్ముతూ తాను మోసపోయినట్లు వీడియోలో వివరించారు.

Pressure of Company Owner Man suicide Attempt: కంపెనీ యాజమాని ఒత్తిడి భరించలేక చనిపోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపారు. ఆర్ధిక సమస్యలతో ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు వీడియోలో పేర్కొన్నారు. తనకు న్యాయం చేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని సెల్ఫీ వీడియోలో రంగనాయకులు కోరారు. తాడిపత్రి శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.